Studio18 News - TELANGANA / : ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి నేడు విచారణ జరిగింది. విచారణకు మత్తయ్య హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులు విచారణకు గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ విచారణకు హాజరు కాలేదు. నిందితులు విచారణకు గైర్హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి సహా నిందితులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Admin
Studio18 News