Monday, 16 March 2026 01:53:14 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

భాగ్యనగర నందనవనం (నారపల్లి) పార్కులో ఆదివారం ఉదయం ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్

Date : 09 March 2026 09:17 AM Views : 60

Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : భాగ్యనగర నందనవనం (నారపల్లి) పార్కులో ఆదివారం ఉదయం ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ 3.0 (East Hyderabad Arogya Run 3.0) ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగు పందెం కార్యక్రమంలో ఆర్గనైజర్ ప్రభాకర్ ఆహ్వానం మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్‌వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నవీన్ రెడ్డి, సీఐ మక్బుల్ జానీ, మాజీ కార్పొరేటర్ యుగేందర్ రెడ్డి, తుంగతుర్తి రవి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. నిత్యం వ్యాయామం, పరుగు వంటి అలవాట్లు మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతాయని, యువత సెల్‌ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరారు. భాగ్యనగర నందనవనం వంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్న రాచకొండ రన్నర్స్ బృందం మరియు వాలంటీర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రన్నర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :