Studio18 News - TELANGANA / RANGAREDDY : రంగా రెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర పాఠశాలలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర పాఠశాలలో ఈరోజు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకొని ఉత్సాహంగా పరీక్షలు రాయడానికి సిద్ధం అయ్యారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్లు పరిశీలించిన తరువాత మాత్రమే విద్యార్థులను లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు.
Admin
Studio18 News