Studio18 News - TELANGANA / SANGAREDDY : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి N. శ్రీవాణి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మందమర్రి ఇల్లందు క్లబ్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి ఏరియా జీఎం శ్రీ N. రాధాకృష్ణ పాల్గొన్నారు. మందమర్రి ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి N. శ్రీవాణి రాధాకృష్ణ మాట్లాడుతూ అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే మహిళలు అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తారని అన్నారు. నేడు మహిళలు వివిధ రంగాల్లో సత్తా చాటుతూ కొన్ని రంగాలను శాసిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్య అతిథి జీఎం రాధాకృష్ణ, సేవా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, డీజీఎం పర్సనల్ అశోక్, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్ తదితర అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఏరియా జీఎం మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత పదవుల నుండి నేడు అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని అన్నారు. సింగరేణిలోనూ మహిళలు అన్ని విభాగాల్లో, అండర్‌గ్రౌండ్ విధుల్లో కూడా రాణిస్తున్నారని తెలిపారు. వారికి అవసరమైన కనీస వసతులు కల్పించడంతో పాటు పనిస్థలాల్లో వారి రక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటూ వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ముందస్తుగా నిర్వహించిన క్రీడల్లో పాల్గొని గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. POSH చట్టంపై అవగాహన కోసం నిర్వహించిన పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారికి ఏరియా జనరల్ మేనేజర్ మరియు సేవా అధ్యక్షురాలు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవా సభ్యులు, సింగరేణి జీఎం కార్యాలయ మహిళా ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ N. రాధాకృష్ణ, మందమర్రి సేవ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీవాణి రాధాకృష్ణ, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, డీజీఎం పర్సనల్ అశోక్, సరిత డై ఫైనాన్స్ మేనేజర్, శ్రీమతి కవిత లేడీస్ క్లబ్ ట్రెజరర్, లేడీస్ క్లబ్ సభ్యులు, జీఎం కార్యాలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Admin
Studio18 News