Wednesday, 10 December 2025 02:07:24 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Revanth Reddy: కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ ఫామ్ హౌస్‌లను కూల్చవద్దా?: రేవంత్ రెడ్డి

Date : 03 October 2024 05:24 PM Views : 356

Studio18 News - TELANGANA / : కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్‌లను కూల్చేయవద్దా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో కలుస్తోందని, ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... వారి ఫామ్ హౌస్‌లను కూల్చుతామనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు... మీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని, డిసెంబర్‌లోపు మరో ముప్పై వేలమందికి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్, వరద సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతుంటే బావ, బావమరిది తమపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి మనుషులతో వారు చేసే హడావుడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు రూ.1,500 కోట్లు వారి పార్టీ ఖాతాలో ఉన్నాయని, వాటి నుంచి రూ.500 కోట్లు మూసీ పరివాహక ప్రాంత పేద ప్రజలకు పంచి పెట్టాలని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చెప్పులు కూడా లేని వారికి, ఇప్పుడు వారి పార్టీ ఖాతాలోకి మాత్రం రూ.1,500 కోట్లు వచ్చాయని విమర్శించారు. హైడ్రా విషయమై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఆ రోజే సూచనలు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చెప్పాలని, వినేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని 15 వేల మందికి ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. హైడ్రా విషయమై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చి సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే చిన్నపాటి వర్షానికే మునిగిపోతోందని, ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సచివాలయానికి వస్తే చర్చించేందుకు సిద్ధమన్నారు. ఈటల రాజేందర్ నేతృత్వంలో నిధుల కోసం ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వెళదామని సూచించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రావాలన్నారు. కేంద్రం నుంచి రూ.25 వేల కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రేషన్ కార్డు కోసం గత పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డు రాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డిజిటల్ కార్డులు అవసరమన్నారు. ప్రతి పేదవాడికి కార్డును అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ తదితర అవసరాలకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :