Sunday, 29 March 2026 05:22:30 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

స్కూల్‌ బస్సు డ్రైవర్లూ జర భద్రం!

స్కూల్‌ పిల్లలను తరలించే విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందర

Date : 28 January 2026 07:08 PM Views : 91

Studio18 News - TELANGANA / HYDERABAD : గ్రేటర్‌లో 18 మంది డ్రైవర్లకు ఆర్టీఏ నోటీసులు లైసెన్స్‌ సస్పెండ్‌ చేయడానికి ఆర్టీఏ అధికారులు రెడీ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : స్కూల్‌ పిల్లలను తరలించే విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంకెన్‌ డ్రైవ్‌తో పట్టుబడగా.. ఇంకొందరూ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులను రోడ్డెక్కించారు. మద్యం మత్తులో ప్రమాదకర డ్రైవింగ్‌ చేసిన 18 మంది విద్యా సంస్థల బస్సుల డ్రైవర్ల లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలని ఆర్టీఏ అధికారులకు పోలీసుల నుంచి సిఫారసులు వచ్చాయి. రవాణా శాఖ అధికారులు వీరి లైసెన్స్‌ సస్పెన్షన్‌ ప్రక్రియలో భాగంగా వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు నిర్లక్షంగా డ్రైవింగ్‌ చేస్తూ మద్యం మత్తులో పోలీసులకు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వారిని కట్టడి చేయడంలో భాగంగా వారి లైసెన్స్‌లను రద్దు చేయనున్నారు. గత రెండేండ్లలో 1415 మంది విద్యాసంస్థల బస్సులు, స్కూల్‌ ఆటో డ్రైవర్ల లైసెన్స్‌లు సస్పెండ్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు విద్యా సంస్థలకు ప్రత్యేక సూచనలు చేశారు. డ్రైవర్ల నియామకంలో ఆర్టీఏ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఉల్లంఘిస్తే బస్సు సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిర్లక్షం కారణంగా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కంటి పరీక్షలు, రోడ్డు నిబంధనలపై ఆర్టీఓ కార్యాలయాల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :