Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షురాలు అయిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ జ్యోతి మాట్లాడుతూ, కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్‌రూమ్, ల్యాబ్‌లు, ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, స్పోర్ట్స్ విభాగం వంటి సౌకర్యాలను వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి బీకాంలో ఏఈ డిపి కోర్సు, బిఎస్ఎఫ్ఎల్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఈ కళాశాలను అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలను కొనియాడుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జి శివరాం, బి ప్రభాకర్, జి శ్రీనివాస్ రెడ్డి, పి రవి రాజ్, ఎం కుమార్ స్వామి, సిహెచ్ రామచందర్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
Admin
Studio18 News