Studio18 News - తెలంగాణ / : చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తాపడడంతో అందులో బతికున్న చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి కొట్టుకున్నాయి. వాటిని చూసిన జనం ఏరుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేశారు.
Admin
Studio18 News