Studio18 News - TELANGANA / NIZAMABAD : Nizamabad districtలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో Mophal మండలం నర్సింగ్‌పల్లి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే R. Bhupathi Reddy ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ ప్రత్యేకతను వివరించారు. కాగా ఇఫ్తార్ విందుకు విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక ముస్లిం మత పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. పలువురు మత పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు అందజేస్తున్న తోఫా కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా Indian National Congress పార్టీ ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. మతతత్వ పార్టీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, మోపాల్ పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కౌలాస్ మోహన్, పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్, సడక్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News