Studio18 News - TELANGANA / JANGOAN : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. తీరుమార్చుకోకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను రోడ్లమీద తిరగనివ్వరు అంటూ శ్రీహరికి హెచ్చరికలు చేశాడు. గురువారం కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రాజయ్య మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : రేవంత్ సర్కార్ పై వరుస ట్వీట్లతో కేటీఆర్ ఫైర్
కడియం శ్రీహరి నీది నాలికా.. తాటి మట్టా.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది అంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అంటూ కడియం శ్రీహరిని హెచ్చరించారు. నమ్మకద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా దగ్గరకు రానివ్వడం లేదని రాజయ్య విమర్శించారు.
1994కు ముందు నీ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? 30ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు. నీ ఇళ్లు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం. విదేశాల్లో నీ ఆస్తులే సాక్ష్యం. ఇంకొకసారి నీతి నిజాయితీ గురించి మాట్లాడొద్దు అంటూ.. శ్రీహరిపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News