Saturday, 24 January 2026 02:40:52 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Patnam Narender Reddy | ఓకే ప్రాజెక్టుకు సీఎం రెండు సార్లు శంకు స్థాపన చేస్తారా.. ? : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

Patnam Narender Reddy | కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సి

Date : 02 December 2025 06:27 PM Views : 201

Studio18 News - TELANGANA / HYDERABAD : Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాల మొదటి సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్, నారాయణ్ పేట లిఫ్ట్‌కు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శంకు స్థాపన చేశారు. నిన్న మక్తల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి సీఎం శంకుస్థాపన చేశారన్నారు. ఓకే ప్రాజెక్టుకు సీఎం రెండు సార్లు శంకు స్థాపన చేస్తారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేదు కనుకే సీఎం సభకు జనాలు రాలేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని సీఎం పూర్తి చేయడం లేదు. కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారన్నారు. ఎన్నికలప్పుడు ఫార్మా భూములను రైతులకు తిరిగి ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చి మాట తప్పారు. ఫ్యూచర్ సిటీని నార్త్ ఇండియా సినీ యాక్టర్లకు అప్పజెబుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ ఉండగా ఇంకా వేరే ఫిలిం సిటీలు ఎందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కృషి వల్లే కోకాపేటలో ఎకరాకు రూ.150 కోట్ల ధర పలుకుతోంది. కేసీఆర్ వేసిన వెంచర్లలో ప్లాట్లు అమ్ముకుని రేవంత్ బతుకుతున్నాడు. రేవంత్‌కు దమ్ముంటే ఫ్యూచర్ సిటీలో వెంచర్ వేసి కోకాపేట రేటు తెప్పించగలరా ? అని పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :