Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వందసార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి వచ్చారని... వీరి పర్యటనల వల్ల రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనున్న నేపథ్యంలో... రెండు అంశాలపై తప్పకుండా చర్చించాలని కేటీఆర్ చెప్పారు. అందులో ఒకటి ఢిల్లీ టూరిజం, రెండోది జైల్ టూరిజం అని ఎద్దేవా చేశారు. ఈ రెండు అంశాల్లో రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించిందని సెటైర్ వేశారు. జైలు టూరిజంలో భాగంగా 40 మంది కొడంగల్ రైతులను జైలుపాలు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సినీ నటులను జైలుకు పంపించారని... బెయిల్ వచ్చినా వారిని విడుదల చేయలేదని విమర్శించారు. సోషల్ మీడియా వారియర్లను జైలుకు పంపారని అన్నారు. ఎల్ అండ్ టీ సీఎఫ్ఓను జైలుకు పంపుతామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదు: హరీశ్ రావు
Admin
Studio18 News