Tuesday, 18 November 2025 03:44:11 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

పత్తి చేనులో ఏదో తేడాగా ఉందంటూ సమాచారం.. పోలీసులు రావడంతో..!

ఎవరికి అనుమానం రాకుండా.. చాలా చాకచక్యంగా గంజాయి సాగు చేస్తున్నారు కొంతమంది. వారువేసే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. వాసన గుప్పుమనడంతో

Date : 11 October 2025 08:15 PM Views : 97

Studio18 News - TELANGANA / SANGAREDDY : ఎవరికి అనుమానం రాకుండా.. చాలా చాకచక్యంగా గంజాయి సాగు చేస్తున్నారు కొంతమంది. వారువేసే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. వాసన గుప్పుమనడంతో ఎలాగోలా ఎక్సైజ్ పోలీసులకు ఊపందింది. దీంతో దాడులు చేయడంతో వీళ్ళ బండారం బట్ట బయలు అయ్యింది. కొన్ని సందర్భాల్లో పోలీసులపై దాడులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు గంజాయి సాగు చేసే వ్యక్తులు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పత్తి చేనులో అంతర్ పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యవసాయ పొలంలో ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు. తండాలో సాగు చేస్తున్న అతని ఇంటికి వెళ్లి ఇంట్లో ఎండు గంజాయి నిల్వ ఉండొచ్చని అనుమానంతో వెళ్లగా ఒక్కసారిగా తండా వాసులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో మధ్య తోపులాట జరిగి పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండలం చల్లగిద్దా తండా గ్రామ శివారులో పత్తి చేనులో జానకి రామ్ అనే వ్యక్తి అంతర్ పంటగా 60 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. రహస్య సమాచారం మేరకు సంగారెడ్డి టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు అట్టి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జానకి రామ్ ఇంట్లో కూడా గంజాయి నిల్వ ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు ఇంటికి వెళ్లగా, జానకి రామ్ ఇంటికి గొళ్ళెం పెట్టి పరార్ అయ్యాడు. దీంతో కొందరు తండా వాసులకు, ఎక్సైజ్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో సీఐ శంకర్ కు గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో నారాయణఖేడ్ డిఎస్పీ తమ సిబ్బందితో తండాకు వెళ్లి పరిస్థితినీ అదుపులో తెచ్చారు. తోపులాటలో తిరగబడ్డ వారిపై ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తోపులాటలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు తోపులాట వీడియోలు చిత్రీకరిస్తుండడంతో వారి ఫోన్లు లాక్కుని దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంలో ఓ గిరిజన నాయకుడు ఉండడం వల్ల కేసు నమోదు కావడంలో ఆలస్యం అవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :