Studio18 News - TELANGANA / : సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం తనను కొంత బాధించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించడంతో అతను విడుదలయ్యారు. ఈ ఘటనపై దానం నాగేందర్ స్పందించారు. అల్లు అర్జున్ పాన్-ఇండియా హీరో మాత్రమే కాదని, ప్రపంచ హీరో అన్నారు. ఆయన తమకు బంధువు కూడా అవుతారని తెలిపారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు. మొత్తానికి అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడం మాత్రం చాలా సంతోషకరమైన విషయమన్నారు. అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చారన్నారు. ఆయన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసిందని, ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నానన్నారు.
Also Read : నిజానిజాలు తెలుసుకోండి.. తప్పుడు ప్రచారం చేయొద్దు: మోహన్ బాబు
Admin
Studio18 News