Monday, 17 March 2025 11:31:32 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

పొలిటికల్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా కవిత ప్లాన్‌? ఇంతకీ ఏంటా ప్లాన్..

Date : 27 September 2024 11:45 AM Views : 49

Studio18 News - TELANGANA / : Gossip Garage : బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కవిత ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? పొలిటికల్ రీ ఎంట్రీకి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారా? త్వరలోనే రాష్ట్రమంతా పర్యటించబోతున్నరా? అంటే… పార్టీ వర్గాల్లో అవుననే టాక్ వినిపిస్తుంది. ఇకపై ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా వెళ్లాలనుకుంటున్నారట కవిత. ఇక మీదట బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కూతురు పొలిటికల్ ఎంట్రీకి కేసీఆర్ వేస్తున్న స్కెచ్ ఏంటి? కవిత యాక్టివ్ అయితే రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? విశ్రాంతికి సెలవు ప్రకటించి విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయం..! బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత… ఇప్పటివరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కవిత… బెయిల్‌ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా సైలెంట్‌గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజమాబాద్‌లోనూ ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఐతే, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తనపై రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట కవిత. అందుకే తన రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం తన బ్రాండ్ బతుకమ్మను వేదికగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. బతుకమ్మ పండగ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ..! ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ సంబరాలతో తనకో బ్రాండ్‌ సంపాదించుకున్నారు కవిత. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలకు ప్రాచుర్యం తీసుకువచ్చారు. ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కవిత… ఇప్పుడు బతుకమ్మ పండగ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతంలో కంటే దూకుడుగా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు… తనపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నారని సమాచారం. సరైన వేదిక కోసం చూస్తున్న కవిత… బతుకమ్మ పండుగను సద్వినియెగం చేసుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. కవిత కూడా తోడైతే రాజకీయంగా బలం పుంజుకోవచ్చని భావన.. ఇప్పటికే కవిత పార్టీ సీనియర్స్, మేధావులతో సమావేశమై, రాజకీయ వ్యుహాలపై సమాలోచనలు చేస్తున్నారట. మెజారిటీ నేతలు బతుకమ్మతోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సూచన చేసినట్లు చెబుతున్నారు. ఇక కవితను కలుస్తున్న కార్యకర్తలు సైతం బతుకమ్మతోనే ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు అధికారం కోల్పోయిన నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఓటమి భారంతో అధినేత ఫామ్‌ హౌస్‌లోనే ఎక్కువగా గడుపుతుండగా, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పార్టీ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు. వీరికి కవిత కూడా తోడైతే రాజకీయంగా బలం పుంజుకోవచ్చని భావిస్తున్నారు. కవిత రోల్ ఎలా ఉండబోతోంది? ఇక ప్రజల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది… ఆమె రోల్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. కుమార్తె రీ ఎంట్రీ విషయంలో అధినేత కేసీఆర్‌ ఆలోచనలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఢిల్లీ స్థాయిలో బాధ్యతలివ్వాలా? రాష్ట్ర స్థాయిలోనా? అనేది ఇంకా తెలియరాలేదు. ఏదిఏమైనా కవిత రీ ఎంట్రీతో బీఆర్‌ఎస్‌లో జోష్‌ తీసుకురావాలనే ప్లానింగ్‌ జరుగుతోందంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :