Monday, 08 December 2025 04:22:39 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Kavitha: గ్రూప్-1 రగడ... ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత పోరాట ప్రకటన

Date : 09 October 2025 06:53 PM Views : 120

Studio18 News - TELANGANA / HYDERABAD : గ్రూప్-1 విషయంలో ప్రభుత్వ తప్పులు ఎండగడతామన్న కవిత 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల నిర్వహిస్తామని వెల్లడి నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్ తెలంగాణలో గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరుస ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గ్రూప్-1 అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15న డివిజన్ బెంచ్ వెలువరించబోయే తీర్పు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత పేర్కొన్నారు. అందుకే, ఆ రోజు వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు. విద్యార్థి అమరవీరుల సాక్షిగా తమ పోరాటాన్ని నిన్ననే ప్రారంభించామని ఆమె గుర్తుచేశారు. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందని కవిత తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాన్ని తాను శాసనమండలిలో ప్రస్తావించినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం చేపట్టిన నియామకాలను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లు కవిత తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ఒత్తిడితోనైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని కవిత హెచ్చరించారు. అభ్యర్థులకు తమ సంస్థ ‘జాగృతి’ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :