Sunday, 08 February 2026 10:59:44 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

ఎవరితోనూ పొత్తు పెట్టుకోము: హరీశ్ రావు

Date : 02 June 2025 01:52 PM Views : 425

Studio18 News - TELANGANA / : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో అగ్రగామిగా నిలిస్తే, అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మహిళలకు రూ.21 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చేసిన వ్యాఖ్యలను నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు పలు ఆరోపణలు చేశారు. "రేవంత్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక్క చెరువు అయినా తవ్వారా? రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో చేయకుండా కొంతే చేశారు" అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలను హరీశ్ రావు ఖండించారు. "కొందరు పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందని ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుంది. ఈ విషయంపై కేసీఆర్ గారు ఇప్పటికే కుండబద్దలు కొట్టి చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయం" అని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. "అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యనైనా సహించబోం" అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో కొందరు అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల నిర్వహణ సరిగా లేదని, దీనివల్ల రాష్ట్ర పరువు పోయిందని హరీశ్ రావు ఆరోపించారు. "అందాల పోటీలు నిర్వహించడం కూడా చేతకాక రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చారు. మిస్ ఇంగ్లండ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, సీసీ ఫుటేజీని బయటపెట్టాలి" అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :