Studio18 News - TELANGANA / HYDERABAD : పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపాటు మొగుడు పెళ్లాం మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం బీఆర్ఎస్ నాయకులు దోపిడీదారులు అంటూ విమర్శలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిర్యాలగూడ మండలం గూడురులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని మండిపడ్డారు. ఆస్తులు సంపాదించుకున్నా మనం ఏమనలేదని, కానీ పెళ్లాం, మొగుడు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించారు. జడ్జిలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, సినిమా తారలను ఎవరినీ వదలలేదని విమర్శించారు. ఎవరు ఫోన్లో మాట్లాడుకుంటే బీఆర్ఎస్ నాయకులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు కేసీఆర్, ఆయన కుటుంబానికి దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చిందని అన్నారు. "జాతిపితకు నోటీసులు ఇస్తారా" అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారని, ఆయన ఎవరికి జాతిపిత అని నిలదీశారు. మీ నాయకులకు మీరు జాతిపిత కావొచ్చు కానీ మాకెందుకు అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సర్వం ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారని, లేదంటే ఏపీలో అధికారం పోయినా పర్వాలేదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుంది తప్ప మీలాంటి దోపిడీదారు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని రేవంత్ రెడ్డి నిలదీశారు.
Admin
Studio18 News