Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలం హోన్నజీపేట గ్రామంలో నమోదైన ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసును ఏసీపీ బి. ప్రకాష్ విచారించారు. ధర్పల్లి మండలం హోన్నజీపేట గ్రామంలో నమోదైన ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు విషయమై ఏసీపీ గ్రామాన్ని సందర్శించి బాధితులు మరియు గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని చెప్పారు. కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బి. ప్రకాష్ తెలిపారు. ఏసీపీతోపాటు ధర్పల్లి సిఐ బిక్షపతి, ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News