Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) బి. ప్రకాష్ ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 11.03.2026 రోజున జరిగిన కాంతామణి మహిళ హత్య కేసుకు సంబంధించిన సంఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి ఘటనపై వివరాలు సేకరించారు. సంఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించి, కేసు దర్యాప్తు వేగవంతంగా మరియు సమగ్రంగా కొనసాగించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బి. ప్రకాష్ తెలిపారు. ఏసీపీతో పాటు సిఐ బిక్షపతి, ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News