Studio18 News - TELANGANA / : Kishan Reddy: పేదలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించింది.. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గిందని కిషన్ రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండానే మూసీ సుందరీకరణ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాగునీరు, డ్రైనేజీ కలిసి ప్రజల రోగాల భారిన పడుతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం న్యాయం కాదు.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరామని.. విధ్వంసాన్ని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కొండా సురేఖ కేటీఆర్ వివాదంపై కిషన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని కోరారు. కుటుంబ వ్యవహారాలు, వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. ఒకరి సంభాషణను వినడం తప్పు. భార్యాభర్తలు, వ్యాపార వేత్తలు, సెలబ్రెటీలను టార్గెట్ చేశారు. కేటీఆర్ మొదలు పెట్టిండు.. రేవంత్ కొనసాగిస్తుండని కిషన్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే అడ్డూఅదుపు లేదన్న కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి భాష చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు.
Admin
Studio18 News