Studio18 News - TELANGANA / RANGAREDDY : ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం వారికి పండ్లు అందించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా పట్నం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టడం గొప్ప సంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎం.ఏ. మతిన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగరావు, మండల కార్యదర్శి చల్లా శ్రీరామ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జడల రాజేందర్ గౌడ్, నక్క శ్రీనివాస్ గౌడ్, కల్వకోల్ వెంకట్ యాదవ్, పొన్న నరసింహారెడ్డి, చల్లా శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు ఇమ్రాన్, హరిప్, ముక్రం ఖాన్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News