Monday, 15 December 2025 01:36:31 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

తెలంగాణ గట్టు మీద చంద్రబాబు స్కెచ్‌

పూర్వవైభవం కోసం సరికొత్త వ్యూహాలు

Date : 05 January 2025 10:25 AM Views : 421

Studio18 News - TELANGANA / HYDERABAD : సైకిల్‌ పంక్చర్ అయింది..చైన్ కూడా తెగిపోయింది. ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పడిలేచిన కెరటమై.. పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలుపెట్టబోతుందట పసుపు పార్టీ. ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన టీడీపీ..పూర్వవైభవం కోసం సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తోందట. సైకిల్‌ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారీ చేయబోతుందా? తెలంగాణ గట్టు మీద చంద్రబాబు వేస్తున్న స్కెచ్‌ ఏంటి? సర్పంచ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ? తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడ్డ పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు వేస్తున్నారట. సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో తెలంగాణ మీదే నజర్ పెట్టబోతున్నారట. జనవరి చివరి కల్లా తెలంగాణ టీడీపీ అధ్యక్ష నియామకం చేపట్టి, కార్యవర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నారట చంద్రబాబు. త్వరలో తెలంగాణలో జరగనున్న సర్పంచ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారట చంద్రబాబు. ఇందులో భాగంగా ప్రతీ 15-20 రోజులకు ఒకసారి హైదరాబాద్‌లో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుండా పోయారు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా టీటీడీపీకి వెంటనే అధ్యక్షుడిని నియమించడంతో పాటు పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ విమర్శలు

సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం..! గత కొన్ని రోజులుగా టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ కార్యవర్గంపై చేస్తున్న కసరత్తు..ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్ష్యుడ్ని నియమిస్తారని టాక్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు సాగుతుండగా, జనవరి మూడో వారంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది.

టీటీడీపీ అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డికి పగ్గాలు? తెలంగాణ టీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై సమాలోచన చేసిన చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న అరవింద్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీలో చేరబోతున్న తీగల కృష్ణారెడ్డి, ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్‌లు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట. అయితే హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డివైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీటీడీపీ అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డికి పగ్గాలు అప్పగించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు, మాజీమంత్రి బాబు మోహన్‌ను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా..అరవింద్ కుమార్ గౌడ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానన్నారు. తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. టీడీపీ కార్పొరేటర్‌గా గెలిచి హైదరాబాద్‌ మేయర్‌గా పని చేశారాయన. దాంతో తిరిగి సొంత గూటికి చేరి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు తీగల కృష్ణారెడ్డి. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్‌, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్‌ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఖమ్మంలోనూ కమ్మ ఓటర్లు ఉండటం..విజయవాడకు బార్డర్‌గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది. తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలనే భావన.. అయితే గెలిచేంత పట్టు ఉందా లేదా అన్నదే చర్చ. ఎలా అయినా తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టగా..కనీసం 10 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెలంగాణలో జరిగే సర్పంచ్ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :