Studio18 News - TELANGANA / : తన ఫామ్ హౌస్ బఫర్ జోన్‌లో లేదని, ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. తన ఫామ్ హౌస్ అక్రమమని కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆరోపిస్తున్నారని, తనతో సహా ఎవరి ఫామ్ హౌస్ అక్రమంగా ఉన్నా కూల్చాల్సిందే అన్నారు. తన ఫామ్ హౌస్ లీగల్‌గానే ఉందని అధికారులు వచ్చి చెప్పారని వెల్లడించారు. తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మొదట నేనే కూల్చేసుకుంటానని వెల్లడించారు. రూల్ ప్రకారమే ఉందని అధికారులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు. తన ఫామ్ హౌస్ అక్రమమైతే కేటీఆర్ వచ్చి చూడవచ్చునన్నారు. అక్కడ తనకు మామిడి తోట ఉందని వెల్లడించారు. అధికారులను అడిగిన తర్వాతే కట్టానన్నారు.
Admin
Studio18 News