Studio18 News - TELANGANA / HANUMAKONDA : హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరేశారు. పోటాపోటీగా ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామసభలో చోటు చేసుకుంది.
Also Read : #chittoor : ప్రభుత్వ లాంఛనాలతో అమర జవాన్ అంత్యక్రియలు
హన్మకొండ జిల్లా కమలాపూర్ లో గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామసభకు పెద్దెత్తున గ్రామస్తులతోపాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికూడా ఈ గ్రామ సభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ పై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించడంతో.. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు.. ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. ఎందుకు ప్రస్తుతం ఇళ్లు రాకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా గ్రామసభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలను విసిరేశారు. దీంతో కౌశిక్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదేసమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలను కాంగ్రెస్ నేతలపైకి విసిరివేయడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని ఇరువర్గాలను నిలువరింపజేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పెద్దెత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పిన పోలీసులు సభ నుంచి వారిని పంపించివేశారు.
Admin
Studio18 News