Studio18 News - TELANGANA / : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో బన్నీ టీషర్ట్, షార్ట్ లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ కు రావాలని బన్నీకి పోలీసులు చెప్పారు. అయితే తనకు బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా? అని బన్నీ అసహనం వ్యక్తం చేశారు. దీంతో బట్టలు మార్చుకోవడానికి బన్నీ వెళ్లగా... పోలీసులు ఆయన బెడ్రూమ్ వరకు వెళ్లారు. దీనిపై కూడా బన్నీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. బెడ్రూమ్ వరకు కూడా వస్తారా? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు అల్లు అర్జున్ తో పాటు పీఎస్ కు వెళ్లేందుకు అల్లు అరవింద్ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
Also Read : అల్లు అర్జున్ అత్యవసర పిటిషన్... ఉదయం మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు
Admin
Studio18 News