Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దసరా పండగకు తన సొంతూరు అయిన కొండారెడ్డి పల్లి గ్రామానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దసరాని తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, తన ఊరి ప్రజలతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఊళ్ళో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పండగను సొంతూళ్లో ఘనంగా చేసుకున్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన దసరా సెలబ్రేషన్స్ అన్ని కలిపి స్పెషల్ గా ఓ వీడియో చేయించి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వీడియోకి గేమ్ ఛేంజర్ సినిమాలోని రా మచ్చ రా మచ్చ సాంగ్ ని జత చేసారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది. చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో సొంతూరికి వస్తే నేను మీ వాడినే అని హీరో పాడతాడు. అలా సొంతూరుకు వస్తే నేను మీ వాడ్ని అని అర్ధం వచ్చేలా రేవంత్ రెడ్డి తన దసరా సెలబ్రేషన్స్ వీడియోకి ఈ పాటని జత చేసాడు. ఈ వీడియోలో తన ఊరు మొత్తాన్ని చూపించారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తన దసరా సెలబ్రేషన్స్ వీడియోని షేర్ చేస్తూ.. గంటలు క్షణాల్లా గడిచిపోయాయి. అనుబంధాలు శాశ్వతమై మిగిలాయి. కొండారెడ్డిపల్లిలో ఈ దసరా నా జీవన ప్రస్థానంలో ఆత్మీయ అధ్యాయం అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసారు.
Admin
Studio18 News