Monday, 08 December 2025 02:41:13 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Tragedy: పండుగ వేళ విషాదం .. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

హోలీ వేడుకలు చేసుకున్న కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు స్నానాలకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలుర దుర్మరణం తెలంగాణలోని వేర్వే

Date : 15 March 2025 10:22 AM Views : 308

Studio18 News - TELANGANA / : హోలీ పండుగ వేళ వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పండుగ వేళ జరిగిన ప్రమాదాలతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన వ్యాపారి సాగర్ గౌడ్ (30) శుక్రవారం మిత్రులతో కలిసి హోలీ వేడుక జరుపుకున్నారు. అనంతరం ఎస్ఆర్ఎస్పీ డి 64 కాలువలో స్నానానికి దిగి గల్లంతై మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విధంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కంపెళ్ల రాజ్ కుమార్ (21) శుక్రవారం బంధువులు, స్నేహితులతో కలిసి హోలీ వేడుక జరుపుకున్న తర్వాత సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లి స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. జాలర్లు అతని మృత దేహాన్ని నది నుంచి వెలికి తీశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన మ్యాదరి అనుదీప్ (15) హోలీ సందర్భంగా బైక్‌పై స్నేహితులను కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా, చిన్నకోమటిపల్లి చెరువు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆదిలాబాద్ పట్టణం కొత్తకుమ్మరివాడకు చెందిన పదో తరగతి విద్యార్ది జిల్లెడ్ వార్ రుషి కుమార్ (16) బాలాజీ‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు ప్రేమ్ తో కలిసి హోలీ వేడుకలు జరుపుకునేందుకు వెళ్లాడు. అనంతరం బైక్‌పై తిరిగివస్తూ స్థానిక మైదానం సమీపంలో రహదారిపై అదుపుతప్పి ఇద్దరూ పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, రుషి కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రేమ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆయా ప్రాంత పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :