Studio18 News - తెలంగాణ / : Hyderabad: హైదరాబాద్ చందానగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ లో కుక్క వెంటపడటంతో దాని నుంచి తప్పించుకోబోయిన యువకుడు మూడు అంతస్థుల పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తెనాలికి చెందిన ఉదయ్ (23) కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చాడు. రామచంద్రాపురం అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చంద్రానగర్ లోని వీవీ ఫ్రైడ్ హోటల్ కు వెళ్లాడు. మూడో అంతస్థు బాల్కానీలోకి వెళ్లగానే కుక్క ఉదయ్ వెంట పడింది. దీంతో కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హోటల్ కిటికీ నుంచి కిందపడి ఉదయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఉదయ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఉదయ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఉదయ్ పరిగెత్తే దృశ్యాలు నమోదయ్యాయి. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Admin
Studio18 News