Studio18 News - అంతర్జాతీయం / HYDERABAD : అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశంలో వంటగ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 14.2 కిలోల గృహ LPG సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.60 వరకు పెంచాయి. పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంతో ఇంధన దిగుమతి వ్యయం పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే గ్యాస్ కొరత భయంతో వినియోగదారులు ముందస్తు బుకింగ్స్ పెంచడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ విరామాన్ని 25 రోజులకు పెంచింది. అంటే రెండు సిలిండర్లు వాడుతున్న వినియోగదారులు ఇప్పుడు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ బుకింగ్ కోసం 25 రోజులు ఆగాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం దేశంలో 25–30 రోజులకు మాత్రమే సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Admin
Studio18 News