Wednesday, 30 April 2025 03:10:17 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

కన్ను పడితే ఖతమే..! ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచర సంస్థలు ఏవో తెలుసా..

Date : 30 September 2024 05:52 PM Views : 66

Studio18 News - అంతర్జాతీయం / : Top Intelligence Agencies : ప్రతి దేశానికి ఒక సొంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (గూఢచార సంస్థ లేదా సీక్రెట్ సర్వీస్ లేదా నిఘా సంస్థ) ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇవి చాలా పవర్ ఫుల్ అని చెప్పాలి. దేశ భద్రతలో ఈ నిఘా సంస్థలు కీ రోల్ ప్లే చేస్తాయి. తమ శత్రువులపై నిరంతరం నిఘా ఉంచుతాయి. వాటి కదలికలను గమనిస్తుంటాయి. తమ దేశ భద్రతకు ఏదైనా ముప్పు ఉంటే వెంటనే పసిగడతాయి ఈ సీక్రెట్ సర్వీస్ లు. తమ దేశం జోలికి వచ్చే శత్రువుల అంతు చూస్తాయి ఈ నిఘా సంస్థలు. మూడో కంటికి తెలియకుండా శ్రతువును మట్టుబెట్టేస్తాయి. తద్వారా దేశ భద్రతలో కీలక రోల్ ప్లే చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. మరి, ప్రపంచంలోని అగ్ర గూఢచార సంస్థలు ఏవో మీకు తెలుసా.. 1. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW-రా)… ఇది భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. విదేశీ గూఢచార సంస్థ. భారత్-చైనా, భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఇతర దేశాల నుంచి మన దేశ భద్రతకు ఉన్న ముప్పును ముందే పసిగట్టడం దీని బాధ్యత. 2. మొసాద్- వరల్డ్ లోనే అత్యంత పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌గా 1947లో ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ.. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్ కి హాని తలపెట్టాలని చూసే వారి అంతు చూస్తుందీ ఈ సీక్రెట్ సర్వీస్. మూడో కంటికి తెలియకుండా టార్గెట్ ను ఫినిష్ చేయడంలో మొసాద్ కు సాటిలేరు. 3. CIA- సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. సీఐఏ అమెరికాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. విధాన నిర్ణేతలకు జాతీయ భద్రతా గూఢచారాన్ని అందించే బాధ్యత ఈ సీక్రెట్ సర్వీస్ దే. 4. FSB – రష్యాకి చెందిన ప్రధాన సెక్యూరిటీ ఏజెన్సీ. కౌంటర్ ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజమ్, అంతర్గత భద్రత.. FSB కీలక బాధ్యతలు. 5. MSS – ఇది చైనాకు చెందిన ప్రాధమిక ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీ. దేశీయ, విదేశీ గూఢచర సేకరణ దీని బాధ్యత. 6. M16- యునైటెడ్ కింగ్ డమ్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్. అంతర్జాతీయ అంశాలపై ప్రభుత్వానికి గూఢచార సేవలు అందించే సంస్థ. 7. ISI – పాకిస్తాన్ కు చెందిన ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. గూఢచార సేవలు, విశ్లేషణ, కోవర్టు ఆపరేషన్లు దీని బాధ్యత.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :