Studio18 News - అంతర్జాతీయం / : US Elections 2024 Pope Francis : ఈ ఏడాది నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచార పర్వం కొనసాగుతుంది. గత రెండురోజుల క్రితం పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్ స్టిట్యూషన్ సెంటర్ వేదికగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ సుమారు 90 నిమిషాల పాటు జరిగింది. ఇరువురి మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. ఈ డిబెట్ అనంతరం కమలా హారిస్ పై ప్రశంసల జల్లు కురిసింది. ట్రంప్ ను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థి హారిస్ సరియైన ఎంపిక అంటూ చర్చ జరుగుతుంది. అయితే, వారిద్దరి డిబేట్ పై పోప్ ఫ్రాన్సి స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్, కమలాహారిస్ తీరుపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ శరణార్థుల పథకాలను వ్యతిరేకించడం, కమలాహారిస్ గర్భవిచ్ఛిత్తి హక్కులకు మద్దతు ఇవ్వడాన్ని పోప్ తప్పుబట్టారు. ఒకరు వలసదారులను విస్మరిస్తే.. మరొకరు చిన్నారులను చంపాలని చెబుతున్నారని పోప్ మండిపడ్డారు. పన్నెండు రోజుల ఆసియా పర్యటన తరువాత రోమ్ కు తిరిగి వస్తున్న తన విమానంలో పోప్ విలేకరులతో మాట్లాడారు. నేను అమెరికన్ ను కాదు. నేను అక్కడ ఓటు వేయను. కానీ, స్పష్టం చెప్పనివ్వండి.. వలసదారులను దూరంగా పంపడం, వలసదారులకు పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వక పోవడం చాలా తీవ్రమైన విషయం అని పోప్ పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల్లో తాను అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే దేశంలోకి అక్రమ వలసదారులను చుట్టుముట్టి వారిని బహిష్కరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. మరోవైపు 1973లో అమెరికాలో గర్భస్రావం మహిళలకు జాతీయ హక్కుగా మార్చబడింది. అయితే, 2022లో యూఎస్ సుప్రీంకోర్టు రద్దు చేయడానికి మార్గం సుగమం చేసింది. అయితే, హారిస్ గర్భస్రావం మహిళలకు జాతీయ హక్కుగా పునరుద్దరిస్తానని హామీ ఇచ్చారు.
Admin
Studio18 News