Monday, 15 December 2025 01:38:20 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Israel: మరో టార్గెట్‌పై ఇజ్రాయెల్ పంజా.. యెమెన్‌లో హౌతీ టార్గెట్‌గా భీకర దాడులు

Date : 30 September 2024 12:24 PM Views : 243

Studio18 News - అంతర్జాతీయం / : పాలస్తీనాలో హమాస్.. లెబనాన్‌లో హిజ్బుల్లాపై దాడుల తర్వాత.. తాజాగా యెమెన్‌లో హౌతీ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. ఆదివారం భీకర దాడులతో విరుచుకుపడింది. హౌతీ లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, పవర్ ప్లాంట్లు, ఒక నౌకాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. రాస్ ఇస్సా‌లోని హోడెయిడా పోర్టుపై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ‘‘ మా సందేశం చాలా స్పష్టంగా ఉంది. మా భద్రతా బలగాలకు ఏ ప్రదేశమూ అంత ఎక్కువ దూరంలో లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వ్యాఖ్యానించారు. కాగా దాడి జరిపిన హుడెయిడా పోర్టు హౌతీ మిలిటెంట్లకు చాలా ముఖ్యమైనది. చమురు దిగుమతి కోసం ఈ నౌకాశ్రయాన్ని ఉపయోగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉండడంతో ఈ పోర్ట్ ద్వారానే ఇరాన్ ఆయుధాలను ఈ ప్రాంతానికి చేరవేస్తున్నారు. చమురు రవాణాతో పాటు సైనిక అవసరాల కోసం దీనినే ఉపయోగిస్తున్నారని, అందుకే దాడి చేసినట్టు ప్రకటనలో ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు చనిపోయారని, 29 మంది గాయపడ్డారని హౌతీ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న ఈ మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ దళాలు దూకుడుగా వైమానిక దాడులను చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా యెమెన్‌లోని లక్ష్యాలపై గురిపెట్టాయి. గత రెండు రోజులుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతోంది. దాని చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :