Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి అనూహ్యంగా వచ్చి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్న కమలా హారిస్‌కు పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ మద్దతు పలకడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాను టేలర్ అభిమానిని కాదని తేల్చిచెప్పారు. ఆమె ఎప్పుడూ డెమోక్రాట్లనే సమర్థిస్తుందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ట్రంప్-కమలా హారిస్ మధ్య ఇటీవల జరిగిన తొలి డిబేట్ తర్వాత కమలా హారిస్‌కు టేలర్ స్విఫ్ట్ మద్దతు ప్రకటించారు. దేశ ప్రజల హక్కుల కోసం కమల పోరాడుతున్నారని ప్రశంసించారు. వారియర్ అయిన ఆమె చాంపియన్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంత పాలన అందిస్తే దేశం చాలా సాధిస్తుందని స్విఫ్ట్ అభిప్రాయపడ్డారు.
Admin
Studio18 News