Monday, 17 March 2025 05:44:49 PM
# Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

Tibetan : టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు ఎగరవు.. అసలు కారణం ఏమిటంటే..

Date : 12 September 2024 11:59 AM Views : 93

Studio18 News - అంతర్జాతీయం / : Tibetan : టిబెట్ మీదుగా విమానాలు ఎగరవని మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే, ఆ ప్రాంతంపై విమానాలు ప్రయాణించడానికి ఎందుకు అనుమతిలేదో మాత్రం చాలా మందికి తెలియదు. టిబెట్ మీదుగా విమానాలు ప్రయాణించకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వాతావరణ ప్రతికూలత. టిబెట్ ను పీఠభూమిని ‘రూల్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి సగటున 4,500 మీటర్ల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఆక్సీజన్ స్థాయి తగ్గుతుంది. విమానం ఎగరాలంటే వాతావరణ పీడనం సరిగ్గా ఉండాలి. టిబెట్ వాతావరణంలో తరచుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా కఠినమైన వాతావరణం ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటం కారణంగా.. భారీ హిమపాతం, చల్లని గాలులు వీస్తుంటాయి. ఇలాంటి వాతావరణం విమానాల ప్రయాణాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అత్యవసర ల్యాండింగ్ కు అవకాశం ఉండదు. కాబట్టి ఈ వాతావరణ ప్రమాదాలను నివారించడానికి విమానయాన సంస్థలు టిబెట్ మీదుగా విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వరు. టిబెట్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏరోనాటికల్ సౌకర్యాల నెట్ వర్క్ చాలా పరిమితంగా ఉంది. ఎత్తైన ప్రదేశం, క్లిష్ట భౌగోళికం కారణంగా అక్కడ వాయు రక్షణ చర్యలను రూపొందించడం కష్టం. ఇదేకాకుండా.. టిబెట్ లో ఆదునిక విమానయాన మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్లకూడా విమానాయన సంస్థలు ఇక్కడి నుంచి విమానాలు నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు టిబెట్ చైనా యొక్క స్వయంప్రతిపత్త ప్రాంతం. దీనికారణంగా ఆ ప్రాంతంపై విమానాలు రాకపోకలు సాగించాలంటే ప్రత్యేక అనుమతి, భద్రతా ప్రొటోకాల్ అవసరం. ఈ భద్రత, రాజకీయ సమస్యల కారణంగా అంతర్జాతీయ విమానాలు, విమానయాన సంస్థలు తరచుగా టిబెట్ మీదుగా విమానాల రాకపోకలకు ప్రాధాన్యతనివ్వరు. అయితే, ప్రధాన కారణం మాత్రం.. టిబెట్ ఎత్తైన ప్రదేశం కావటం, విమానాల ప్రయాణానికి సరియైన వాతావరణం అక్కడ లేకపోవటమేనని చెప్పొచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :