Thursday, 05 December 2024 09:34:18 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Fine: ఎక్స్ కు రూ.5 కోట్ల జరిమానా... ఐర్లాండ్ లో ఇంత పెద్ద జరిమానా ఇదే మొదటిసారి

Date : 17 August 2024 11:51 AM Views : 65

Studio18 News - అంతర్జాతీయం / : సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ కు ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్సీ) భారీ షాక్ ఇచ్చింది. తొలగించిన ఓ ఉద్యోగికి భారీగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఉద్యోగికి పరిహారంగా 6,02,640 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.5 కోట్లు జరిమానా విధించి దానిని ఉద్యోగికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇవ్వడం ఐర్లాండ్ లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆ వివరాలలోకి వస్తే .. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ .. ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక మార్పులు, చేర్పులు చేశారు. ఆ క్రమంలో భాగంగా ట్విట్టర్ ను మెరుగుపరిచేందుకు ఉద్యోగులు అంకితభావం, సుదీర్ఘ పని గంటలకు కట్టుబడి ఉండాలని మస్క్ సూచించారు. ఇందుకు గానూ ఈ మెయిల్ చివరిలో అవును, కాదు అనే ఆప్షన్ లు ఇచ్చి అభిప్రాయాలను తెలపాలని కోరారు. దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామంటూ షరతు విధించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు గానూ మూడు నెలల సమయం కూడా ఇచ్చారు. అయితే 2013 నుండి డబ్లిన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న గ్యారీ రూనీ ఈ మెయిల్ కు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. దీంతో కారణాలు తెలపకుండానే అతన్ని స్వచ్చందంగా ఉద్యోగం నుండి తొలగించారు. దీంతో అతను డబ్ల్యూఆర్సీని ఆశ్రయించారు. కమిషన్ దీనిపై విచారణ జరిపి తాజాగా తీర్పును వెల్లడించింది. ఈమెయిల్ లో అవును అని క్లిక్ చేయకపోవడాన్ని రాజీనామాగా పరిగణించలేమని న్యాయాధికారి మైఖెల్ మాక్ నామీ పేర్కొన్నారు. రూనీ ఆకస్మిక తొలగింపుతో ఆర్ధికంగా, వృత్తి పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు పరిహారంగా అతనికి రూ.5 కోట్లు చెల్లించాలని తీర్పులో కమిషన్ పేర్కొంది. ఈ తీర్పుపై ఎలాన్ మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :