Studio18 News - అంతర్జాతీయం / : Israel-Iran War: ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉధ్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎర్ర సముద్రం. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ సముద్రం గుండా షిప్పింగ్ మార్గం అందుబాటులోకి రాకపోవచ్చు. తద్వారా సరుకు రవాణా, ఇతర వస్తువుల ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశం చమురు, గ్యాస్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అధిక ధరలు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులు పెరుగుతన్నప్పటికీ.. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారతదేశం కూడా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది. భారతదేశం ఆగస్టు దిగుమతుల్లో రష్యా చమురు వాటా వరుసగా ఐదు నెలలు పెరిగిన తరువాత సుమారు 36శాతంకు తగ్గింది. జూలైలో భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యా చమురు వాటా 44శాతం. భారతదేశం క్రూడ్ దిగుమతుల్లో మధ్యప్రాచ్య చమురు వాటా జూలైలో 40.3శాతం నుంచి 44.6శాతంకు పెరిగింది. ఏప్రిల్ – ఆగస్టులో ఈ ప్రాంతం యొక్క వాటా ఏడాది క్రితం 46శాతం నుంచి 44శాతంకు క్షీణించింది. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ భారతదేశానికి ప్రధాన మధ్యప్రాచ్య చమురు సరఫరాదారులుగా ఉన్నాయి. మరోవైపు.. భారతదేశం ఖాతర్ నుంచి ద్రవ రూప సహజ వాయువు (ఎల్ఎన్జీ)ని దిగుమతి చేసుకుంటుంది. ఎల్ఎన్జీ దిగుమతులను మరో 20ఏళ్లు పొడిగించేందుకు ఫిబ్రవరిలో ఖాతర్ తో 78 బిలియన్ డాలర్ల ఒప్పందంను భారత్ కుదుర్చుకుంది. భారతదేశం రష్యా నుంచి ఎర్ర సముద్రం ద్వారా చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం తలెత్తితే.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ( కేప్ ద్వీపకల్పం) ద్వారా సరుకులను మళ్లించడం. అంతేకాకుండా ఖాతర్ నుంచి భారత్ దేశం ఎల్ఎన్జీని, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి చమురును హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా చేయడం మరో సవాలు కావచ్చు. ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న హోర్ముజ్.. పెర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. హార్ముజ్ ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు చోక్ పాయింట్. ఎందుకంటే ఈ జలసంధి ద్వారా భారీగా చమురును రవాణా జరుగుతుంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు 2022 నుంచి 2023 మొదటి అర్ధభాగంలో మొత్తం హార్ముజ్ నుంచి ముడి చమురు, ఇతర వస్తువుల రవాణాపై 67శాతం వాటాను కలిగి ఉంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఆసియాకు తరలిస్తున్న ముడి చమురులో చమురు, ఎల్ఎన్జీ దిగుమతుల్లో భారతదేశానిదే అగ్రస్థానం ఉంటుంది. అయితే, ఇక్కడ ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. ఇరాన్-ఇజ్రాయెల్ లేదా ప్రాక్సీ వివాదంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాలు తటస్థతలో ఉండటం.
Admin
Studio18 News