Studio18 News - అంతర్జాతీయం / : తల్లిదండ్రుల బెడ్రూంలో కనిపించిన తుపాకి చూసిన ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తనని తాను కాల్చుకున్నాడు. అమెరికాలోని చిన్న నగరగమైన సాల్ట్ లేక్‌లో జరిగిందీ ఘటన. ఆడుకుంటూ తల్లిదండ్రుల బెడ్రూంలోకి వెళ్లిన చిన్నారి అక్కడ తుపాకి చూశాడు. ఆపై దానిని తీసి ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకున్నాడు. ఘటన జరిగినప్పుడు బయట ఉన్న బాలుడి తండ్రి కాల్పుల శబ్దం విని లోపలికి పరిగెత్తుకుని వెళ్లాడు. కిందపడిన కుమారుడికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిందీ, లేనిదీ తెలియరాలేదు. విషయం తెలిసిన చాలామంది.. తల్లిదండ్రులకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని, ఆయుధాలు పిల్లలకు అందకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత వారిదేనని చెబుతున్నారు. కొందరు మాత్రం ఈ ఘటనకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని అంటున్నారు.
Admin
Studio18 News