Studio18 News - అంతర్జాతీయం / : Israeli Attack on school in Gaza City : గాజాలో ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు వంద మందికిపైగా మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం.. ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరంలోని ఆల్ సహాబా ప్రాంతంలో ఆల్ తబాయీన్ పాఠశాలపై బాంబు దాడికి పాల్పడిందని, ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ ఈ ఘటనను భయంకరమైన ఊచకోతగా అభివర్ణించాడు. కొందరు శరీరాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయని తెలిపాడు. మరోవైపు ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం.. హమాస్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్లు చెప్పింది.
Admin
Studio18 News