Thursday, 12 March 2026 03:47:28 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

China: చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌

సైనిక సమాచారం లీక్ చేశారని వైడాంగ్ పై ఆరోపణలు కీలక పదవుల్లోని అధికారులను మార్చేస్తున్న అధ్యక్షుడు ఫుజియాన్‌లో పనిచేసే పలువురు జనరల్స్‌ కూడా అరెస్ట్!

Date : 18 March 2025 03:23 PM Views : 263

Studio18 News - అంతర్జాతీయం / : చైనా సైన్యంలో కీలకమైన మరో జనరల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ సెక్రటరీ సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైడాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హి వైడాంగ్ అరెస్టు వార్త ప్రస్తుతం చైనాలో సంచలనంగా మారింది. సైన్యంలో అత్యంత కీలకంగా భావించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు స్వయంగా చైనా అధ్యక్షుడే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్ వైస్ చైర్మన్ ను అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వంలో, సైన్యంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను జిన్ పింగ్ ఇటీవల కాలంలో మార్చేస్తున్నారు. నాన్‌జింగ్‌ మిలిటరీ రీజియన్‌లో జనరల్‌ లాజిస్టిక్స్‌ అధిపతిగా పనిచేసిన ఝావో కేషిని కూడా ఇటీవల అరెస్టు చేశారు. గతేడాది కూడా మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని, అంతకుముందు ఏకంగా చైనా రక్షణ మంత్రిని అరెస్టు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :