Studio18 News - అంతర్జాతీయం / : Pakistan Economic Crisis : ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతోంది. రుణం కోసం ఏమి చేయటానినికైనా సిద్ధంగా ఉంది. తాజాగా 7 బిలియన్ డాలర్ల ఒప్పందం విషయంలో ఐఎంఎఫ్ కండీషన్లకు తలూపింది. పాలనాపర ఖర్చులను తగ్గించుకునేందుకు దాదాపు లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టనుంది. అంతేకాదు ఆరు మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికింది. మరో రెండు శాఖలను విలీనం చేయనున్నట్లు కూడా తెలిపింది. గతేడాది ఆర్థిక సంక్షోభంతో దివాలాకు పాకిస్తాన్ చేరువైనప్పటికీ.. ఐఎంఎఫ్ ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది. ఇదే చివరిసారి అంటూ దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్ తో కొంతకాలంగా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సహాయ ప్యాకేజీ విషయంలో ఎట్టకేలకు ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. ఖర్చులు తగ్గించుకోవడం, పన్ను, జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాలపై పన్ను, రాయితీలు తగ్గించడం లాంటి చర్యలకు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. దీంతో మొదటి విడతగా ఒక బిలియన్ డాలర్లను విడుదల చేసింది ఐఎంఎఫ్.
Admin
Studio18 News