Wednesday, 10 December 2025 02:26:19 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Paris Olympics: ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్రాన్స్ ఎంపీ సంచలన ప్రకటన

Date : 22 July 2024 11:27 AM Views : 266

Studio18 News - అంతర్జాతీయం / : పారిస్ వేదికగా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొంటున్న కారణంగా వారికి స్వాగతం పలికేది లేదంటూ ఆయన కలకలం రేపారు. పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై నిషేధం విధించాలని అన్నారు. ఈ దిశగా మార్పుల కోసం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీపై ఫ్రాన్స్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలన్నారు. ఈ నేపథ్యంలో థామస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, థామస్ వ్యాఖ్యలను ఫ్రాన్స్ యూదుల గ్రూపు ప్రతినిధి ఆర్ఫీ ఖండించారు. అథ్లెట్లను లక్ష్యం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే అథ్లెట్లకు ప్రమాదం పొంచి ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1972 ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లను హత్య చేసిన ఉదంతాన్ని గుర్తు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :