Saturday, 07 March 2026 07:57:27 PM
# కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..? # గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Air canada: దుప్పటి విషయంలో తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు!

Date : 31 July 2024 11:12 AM Views : 398

Studio18 News - అంతర్జాతీయం / : విమానం సిబ్బంది తీరుతో విసిగిపోయిన ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దయిన ఘటన మొరాకోలో శుక్రవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మాంట్రియాల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్యాసెంజర్.. ఫ్లైట్ అటెండెంట్‌ను దుప్పటి ఇవ్వమని అడిగారు. ఏసీ కారణంగా చలి ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఫ్లైట్ అటెండెంట్‌కు, ప్యాసెంజర్‌కు మధ్య ఊహించని విధంగా వాగ్వాదం తలెత్తింది. ప్యాసెంజర్‌పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఫ్లైట్ అటెండెంట్ మర్యాదగా నడుచుకోవాలని హెచ్చరించింది. ఆ తరువాత విమానం దిగిపోవాలని కోరింది. వెనక్కు తగ్గని ప్యాసెంజర్.. కెప్టెన్‌ను పిలుచుకురావాలని ఫ్లైట్ అటెండెంట్‌ను కోరారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఆమె తాను ప్యాసెంజర్ల బెదిరింపులకు లొంగిపోయేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, ఇతర ప్యాసెంజర్లు కూడా ఫ్లైట్ అటెండెంట్‌తో వాదనకు దిగారు. సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి దిగిపోయారు. దీంతో, ఫ్లైట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. విమాన సర్వీసు రద్దయిన మాట వాస్తవమేనని ఎయిర్ కెనడా ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చామని పేర్కొంది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పింది. ఈ మేరకు ఎయిర్ కెనడా ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :