Thursday, 05 December 2024 08:53:03 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Lebanon: లెబనాన్ లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ బలగాలు!

Date : 26 September 2024 12:13 PM Views : 33

Studio18 News - అంతర్జాతీయం / : లెబనాన్ నుంచి తమ భూభాగంపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రెండు రోజుల పాటు వైమానిక దాడులు చేసి హిజ్బుల్లా కీలక నేతలు సహా వందలాది మందిని మట్టుబెట్టింది. అయినప్పటికీ హిజ్బుల్లా దాడులు ఆగకపోవడంతో గ్రౌండ్ దాడులకు సిద్ధంగా ఉండాలంటూ తన బలగాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఐడీఎఫ్ బలగాలు లెబనాన్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేసింది. గడిచిన మూడు రోజుల్లో లెబనాన్ లోని 2 వేలకు పైగా హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెడతామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన హిజ్బుల్లా కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయంపైకి బుధవారం బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించినట్లు హిజ్బుల్లా వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయెల్- హిజ్బుల్లా యుద్ధంపై అమెరికా రక్షణశాఖ స్పందించింది. లెబనాన్ పై గ్రౌండ్ అటాక్ చేయాలన్న నిర్ణయం అంత మంచిది కాదని పేర్కొంది. అయితే, మధ్య ప్రాచ్యంలో ఆల్ ఔట్ వార్ జరిగే అవకాశం లేకపోలేదంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. లెబనాన్ లో దాడులను వెంటనే ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇజ్రాయెల్ కు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందిస్తూ.. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందంటూ ఇజ్రాయెల్ పై మండిపడింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :