Studio18 News - అంతర్జాతీయం / : Mossad : భయం పోవాలంటే నమ్మకం పెరగాల. భయం అంటే ఏంటో తెలియాలంటే ఇజ్రాయెల్ మొసాద్ గురించి వినాల. సినిమా స్టైల్ లో చెప్పాలంటే అదొక డెవిల్ టీమ్. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ బలం అదే. చంపేయడం అంటే.. అలా ఇలా కాదు. ఆ చావు గుండెల్లో వణుకు పుట్టించాల. గొంతెత్తాలన్నా ధైర్యాన్ని కూడా చంపేయాల. సరిగ్గా ఇలానే ఉంటాయి ఇజ్రాయెల్ ఆపరేషన్స్. శత్రువులను వరుస పెట్టి ఏరేస్తోందా దేశం. అది కూడా నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అన్నట్లు వాళ్ల డెన్ లోనే సైలెంట్ గా మట్టు పెట్టేస్తోంది. ప్రపంచంలో అత్యంత స్ట్రాంగ్ నిఘా వ్యవస్థ కలిగిన దేశంగా దూకుడు మీదున్న ఇజ్రాయెల్.. తమ దేశం వైపు, తమ ప్రజల వైపు చూస్తే.. భయం ఏంటో పరిచయం చేస్తామని ఒక్కో చావుతో ప్రూవ్ చేస్తోంది. టు సీ ది ఇన్విజిబుల్.. అండ్ డూ ది ఇంపాజిబుల్.. ఇదీ మొసాద్ ట్యాగ్ లైన్.. నిఘా వ్యవస్థల్లో ప్రపంచంలోనే ద బెస్ట్ మొసాద్. ఇజ్రాయెల్, పాలస్తీనా పోరులో ఎంతమంది బలవుతున్నా.. ఎన్ని దేశాల నుంచి హెచ్చరికలు వచ్చినా.. మొసాద్ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. దేశ ప్రయోజనాలు మినహా మరేదీ ముఖ్యం కాదంటూ దూసుకెళ్తోంది. ఇజ్రాయెల్ ప్రతీ అడుగు జాగ్రత్తగా పడేలా చూస్తోంది మొసాద్. ఇజ్రాయెల్ తో గేమ్స్ ఆడితే శాల్తీ గల్లంతే. మొసాద్.. ఈ పేరు వింటేనే శత్రువులకు ముచ్చెమటలు. టార్గెట్ చేస్తే ఆధారాలు కాదు కదా.. కనీసం బాడీ కూడా దొరకదు. ఇరాన్, లెబనాన్, హిజ్ బొల్లాపై ఇజ్రాయెల్ వార్ లో మొసాద్ ది కీలక పాత్ర. ఇజ్రాయెల్ నిఘా నెట్ వర్క్ చాలా స్ట్రాంగ్. తమ దేశానికి, తమ పౌరులకు, యూదులకు హాని కలిగించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా, ఎంత నక్కి నక్కి దాక్కున్నా.. పసిగట్టి మరీ మట్టుబెడుతుంది. తమ దేశంపై దాడి చేయడం కాదు.. చేయాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిసినా.. వెంటాడి వేటాడి చంపుతుంది. ఇజ్రాయెల్ తో గేమ్స్ ఆడే యత్నం చేసిన ఎవరైనా సరే..మొసాద్ నుంచి తప్పించుకోలేరు. మిడిల్ ఈస్ట్ లో తీవ్రవాద గ్రూపులకు, పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ కోవర్టులకు మొసాద్ పేరు వింటేనే ముచ్చెమటలు పట్టేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మొసాద్ కు పేరుంది. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గా 1947లో ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ.. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
Admin
Studio18 News