Studio18 News - అంతర్జాతీయం / : China Taiwan War : ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, యుక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచం వణికిపోతుంటే.. ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వేందుకు డ్రాగన్ కంట్రీ కూడా సిద్ధమవుతోందా? అనే భయాలు కలుగుతున్నాయి. తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టడానికి కారణం ఏంటి? పసికూన తైవాన్ ను చైనా భయబ్రాంతులకు ఎందుకు గురి చేస్తోంది? తైవాన్-చైనా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయా? పొరుగు దేశమైన తైవాన్ తో చైనా యుద్ధానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతూ ఆ దేశాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఓపక్క తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతున్న చైనా.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు తాజాగా పిలుపునిచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య వార్ ఏ క్షణమైనా జరగొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కి చెందిన బ్రిగేడ్ ను జిన్ పింగ్ సందర్శించారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలతో తైవాన్ తో చైనా కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్ సందర్శన అనంతరం సైనికులంతా సమగ్రమైన శిక్షణ, సన్నద్ధతతో యుద్ధానికి సైనిక బలగాలు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. సైనికులంతా తమ పోరాట సామర్థ్యాలను పెంచుకోవాలని ఆయన సూచించారు. జిన్ పింగ్ వ్యాఖ్యలతో వార్ ఏ క్షణమైనా జరగొచ్చని, అందుకోసం సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు తైవాన్ స్వతంత్ర సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న చైనా.. ఆ దేశం చుట్టూ పెద్ద ఎత్తున మిలటరీ డ్రిల్స్ నిర్వహించడం సంచలనంగా మారింది. తైవాన్ కు అత్యంత సమీపంలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలతో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం కూడా చైనా – తైవాన్ ల మధ్య యుద్ధానికి తెరలేపడానికి సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉంది. ఇక తైవాన్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యుద్ధం చేసేందుకు వెనుకాడబోమని బీజింగ్ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. తైవాన్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యుద్ధానికి వెనుకాడబోమన్న చైనా వ్యాఖ్యలు కూడా.. ఏ క్షణంలోనైనా ఈ రెండు దేశాల మధ్య వార్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే యుక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రపంచం వణికిపోతుంటే.. చైనా-తైవాన్ యుద్ధంతో మరోసారి బాంబుల మోత మోగనుంది. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ దేశాలపై పడనుంది.
Admin
Studio18 News