Sunday, 25 January 2026 05:13:51 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Elon Musk: ట్రంప్ క్యాబినెట్ భేటీలో నేతల గొడవ.. మస్క్, రూబియోల మధ్య విభేదాలు

ఉద్యోగులను తొలగించడం లేదని రూబియోపై మస్క్ ఆరోపణ ముందే పదవీ విరమణ చేసిన వారిని ఉద్యోగంలోకి తీసుకుని తొలగించాలా? అంటూ రూబియో ఎద్దేవా మస్క్, రూబియోల మధ్య

Date : 08 March 2025 11:43 AM Views : 251

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి మార్కో రూబియోపై డోజ్ సలహాదారు ఎలాన్ మస్క్ విమర్శలు చేశారని, దీంతో ట్రంప్ సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అయితే, అలాంటిదేమీ లేదంటూ ట్రంప్ ఈ వార్తలను కొట్టిపారేశారు. మస్క్, రూబియోల మధ్య గొడవలు లేవని, ఇద్దరూ చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ వివరించారు. అసలు ఏంజరిగిందంటే.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డోజ్ సలహాదారు మస్క్ లు ఇటీవల జరిగిన ట్రంప్ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులలో పనిచేయని వారిని తాను ఇంటికి పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు. మార్కో రూబియో మాత్రం ఎవరినీ తొలగించడం లేదని ఆయన విమర్శించారు. దీనిపై రూబియో స్పందిస్తూ.. ఇప్పటికే 1500 మంది ఉద్యోగులు ముందస్తుగా పదవీ విరమణ చేశారని తెలిపారు. ఇప్పుడు తాను తొలగించాలంటే వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని ఆపై తొలగించాలని మస్క్ ను ఎద్దేవా చేశారు. ఆ తర్వాత మస్క్, రూబియోల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మీడియా ప్రచురించిన వార్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, రూబియో- మస్క్ ల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ఆ నేతలిద్దరూ తమ తమ శాఖలలో చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ కితాబునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :