Sunday, 08 March 2026 04:44:43 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Donald Trump: ఉక్రెయిన్ అంశంపై ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్ .. పుతిన్ ఏమన్నారంటే..?

పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్ రెండు గంటల పాటు వివిధ అంశాలపై సంభాషణలు ఉక్రెయిన్ కు విదేశీ సాయం నిలిపివేస్తేనే పూర్తిగా కాల్పుల విరమణకు ఆలోచిస్తా

Date : 19 March 2025 11:14 AM Views : 270

Studio18 News - అంతర్జాతీయం / : ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. వారిద్దరూ సుమారు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందే ట్రంప్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించి తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. 30 రోజుల కాల్పుల విరమణ జరుగుతున్న సమయంలో పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలో ఉక్రెయిన్ పవర్ ప్లాంట్లపై ఇక దాడులు చేయనని, మౌలిక సదుపాయాలు నాశనం చేయనని పుతిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు మాత్రం పుతిన్ అంగీకరించలేదని, ఉక్రెయిన్‌కు విదేశీ సాయం నిలిపివేస్తే అప్పుడు పూర్తి కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తానని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించకుండానే పుతిన్ షరతులు విధించారని అంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం పుతిన్‌తో చర్చలు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇతర అంశాలపై రష్యాతో తమ ప్రతినిధి బృందం చర్చలు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :