Monday, 15 December 2025 12:58:10 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Imran Khan: ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ నామినేషన్

Date : 19 August 2024 01:59 PM Views : 187

Studio18 News - అంతర్జాతీయం / : బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆయన సహాయకుడు సయీద్ జుల్ఫీ బుఖారీతో పాటు పాక్ పత్రిక డాన్ ధ్రువీకరించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఛాన్సలర్ పదవి కోసం శతాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ పదవికి పోటీ చేయడానికి అర్హులు. తాజాగా ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మార్పులు చేశారు. నామినేషన్, ఓటింగ్ అన్ లైన్ లో జరిగే వెసులుబాటు కల్పించారు. ఇమ్రాన్ ఖాన్ 1970లో ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్ లో పట్టా అందుకున్నారు. గతంలో బ్రాడ్ ఫోర్డ్ యూనివర్శిటీకి ఎనిమిదేళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ ఛాన్సలర్ గా పని చేశారు. నిన్నటితో ఆక్స్ ఫర్డ్ లో నామినేషన్ల గడువు ముగిసింది. అక్టోబర్ 28న ఆన్ లైన్ లో ఓటింగ్ జరుగుతుంది. బ్రిటన్ లోని శక్తిమంతమైన రాజకీయ నాయకులు కూడా ఈ పదవికి పోటీ పడిన వారిలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియా జైల్లో ఉన్నారు. తోషఖానా, సైఫర్, ముస్లిం వ్యతిరేక వివాహం తదితర కేసుల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన భార్య బుర్షా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ పై 200కి పైగా కేసులు నమోదు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :