Wednesday, 18 June 2025 07:53:00 PM
# అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు! # భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు # విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీకి నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు # ఇరాన్ ప్రకటనను ఖండించిన పాక్ రక్షణ మంత్రి # ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న జిల్లా కలెక్టర్ కు రేవంత్ రెడ్డి అభినందనలు # ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కండక్టర్‌ లేకుండానే బయల్దేరిన బస్సు.. చివ‌రికి! # చిరుతపులిని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ చూసి ఉండరు! # బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు # ఆ ప్రముఖ క్రికెటర్ చెప్పిన మాట వినుంటే... కరుణ్ నాయర్ కెరీర్ ముగిసేదేమో! # ఖతర్‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు సహా 11 మంది అరెస్ట్ # టమాటా రైతును కోలుకోలేని దెబ్బ తీస్తున్న 'ఊజీ ఈగ' # జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం కూల్చివేత.. లోపల బయటపడ్డ విలాసాలు!

Vinod Khosla: డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థించిన ఎలాన్ మస్క్‌పై భారత సంతతి సీఈఓ ఆగ్రహం

Date : 22 July 2024 11:23 AM Views : 155

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్టు జో బైడెన్ ప్రకటించడం అగ్రరాజ్య రాజకీయాల్లో పెను కలకలానికి దారి తీసింది. అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పేరును సమర్థిస్తున్నట్టు కూడా బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత అమెరికన్ సీఈఓ వినోద్ ఖోస్లా, టెక్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌ల మధ్య రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విషయంలో మాటల యుద్ధం మొదలైంది. డొనాల్డ్ ట్రంప్‌కు దీటైన అభ్యర్థిని డెమోక్రాట్లు ఎన్నుకోవాలంటూ తొలుత వినోద్ ఖోస్లా ట్వీట్ చేశారు. ‘‘ట్రంప్‌ను సులువుగా ఓడించే అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓపెన్ కన్వేన్షన్ నిర్వహించేందుకు సమయం ఆసన్నమైంది. @GovWhitmer లేదా @GovernorShapiro ఇందుకు తగిన వారు. అతివాదుల చెరలో అమెరికా చిక్కుకోకుండా వీళ్లు ఆపగల సమర్థులు. లెఫ్ట్, రైట్ భావజాలం కాకుండా మధ్యేమార్గం ఎంచుకునేందుకు ఇదే సరైన సమయం. ఆర్థికంగా, పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన వైఖరి కోరుకునే వారందరూ దీన్ని సమర్థించాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు వెంటనే స్పందించిన ఎలాన్ మస్క్ ట్రంప్ కంటే మంచి అభ్యర్థి లేడనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. దీనిపై వినోద్ ఖోస్లా ఘాటుగా స్పందించారు. ‘‘అత్యాచారాలు, అబద్ధాలు చెప్పేవారు, మహిళల్ని కించపరిచే వారు, కనీస విలువలు లేని వారిని సమర్థించలేను. ఆయన పన్నులు తగ్గించొచ్చు, నిబంధనలను సరళీకరించొచ్చు. అంతమాత్రాన విలువల లేమిని అంగీకరించలేము కదా. పర్యావరణ రక్షణలో దేశాన్ని పదేళ్ల వెనక్కు తీసుకెళ్లే వాళ్లు అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటామా? అలాంటి వాళ్లు నీ సంతానానికి అదర్శం కావాలని కోరుకుంటావా?" అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు. దీంతో, వీరిద్దరి సంవాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :